ఆదిలాబాద్: మజ్లిస్ కనుసన్నల్లో కేసీఆర్ పాలన నడుస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్‌లో అమిత్ షా పర్యటించారు. జిల్లాలో జనగర్జన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేసీఆర్ ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు. కొడుకు, కూతురు కోసమే కేసీఆర్ పని చేస్తున్నారు. ఆర్టికల్ 360తో కశ్మీర్‌ను కాపాడుకున్నాం. రాం మందిర్ నిర్మాణం చేస్తోంది, భవ్య రాం మందిర్ జనవరి నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుంది. సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ ఉగ్ర వాదులను మట్టుపెట్టాం. తెలంగాణలో రజాకార్ల పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాలన చేస్తోంది’’ అని అమిత్ షా పేర్కొన్నారు.









