ఆదిలాబాద్ బీజేపీ జనగర్జన సభలో కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతాపార్టీ జాతీయ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనబడటం లేదని..తనకు చాలా బాధగా ఉందని..ఆయనకు భద్రత కల్పించాలని కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కేసీఆర్ తనకు గురువు అని ఆయన్ని చూసి మాట్లాడటం నేర్చుకున్నానని చెప్పిన బండి సంజయ్..కేసీఆర్ కనబడటం లేదంటే కేటీఆర్ ఏం చేసిండో అని తనకు అనుమానం కలుగుతోందని బహిరంగ సభ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టిన కేసీఆర్ ఎందుకోసం 5లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తేనే ఈ అప్పుల గోస పోతదన్నారు. ఒక్కసారి ఓటు పొరపాటున బీఆర్‌ఎస్‌కి ఓటేస్తే ..ఐదేళ్లు బర్బాత్ అయిపోతామన్నారు బండి సంజయ్. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే …బీసీలకు మంచి జరుగుతుందన్నారు.









