AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ సాధనలో కేసీఆర్‌ పాత్ర ఒక్క శాతమే..

ముఖమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కోమటిరెడ్డి నిప్పులు
తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఎవడిది బానిసత్వ పార్టీ అంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ పేరుతో కేటీఆర్ లక్షల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానుకోవాలని.. సోనియా గాంధీపైనా, కాంగ్రెస్ పైనా నోరు పారేసుకోవద్దని కేటీఆర్ కు హితవు పలికారాయన.

”నాడు సోనియాతో గ్రూప్ ఫొటో కూడా దిగావు కదా కేటీఆర్. ఇంకోసారి సోనియాపై మాట్లాడితే పాపం తగులుతుంది. రాజకీయాల్లో నీకేం అనుభవం ఉంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు. రెండో దశ ప్రారంభం కాగానే వచ్చావు. కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ రాలేదని కేటీఆర్ తెలుసుకోవాలి” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

” కేటీఆర్ కి కొంత నాలెడ్జ్ ఉంది అనుకున్నా. ఈరోజు చిట్ చాట్ తర్వాత కేటీఆర్ కి ఏమీ తెలియదని అర్థమైంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమే. రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి కేటీఆర్. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టారు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మేం తెలంగాణ కోసం కొట్లాడాము.

పార్లమెంటులో కేసీఆర్ ఒక్కసారైనా తెలంగాణ కోసం మాట్లాడారా? కేబినెట్ మంత్రుల్లో చాలామంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళే. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియాని ఎందుకు కలిసింది? ఎందుకు గ్రూప్ ఫోటో దిగింది. మహమూద్ అలీ, పద్మా దేవేందర్ రెడ్డిలను బానిసల్లా చూసింది కేసీఆరే. మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా?

కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు. బీఆర్ఎస్ లో అలా కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్షు ముఖ్యమంత్రి అవుతాడు. మా చెల్లిని అరెస్ట్ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్.. అమిత్ షాకి చెప్పి వచ్చారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి? దలితబంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నా” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ANN TOP 10