AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ పై బరిలోకి ఈటల రాజేందర్ భార్య!

మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడోసారి అధికారం చేజిక్కుంచుకోవాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించి కేసీఆర్ సంచలనం రేపారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి తనదైన వ్యూహాలతో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండ్లు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్,కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత తెలిపారు.

మరోవైపు 10ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలన్న కసితో ప్రయత్నాలు చేస్తోంది. ఇక,తెలంగాణలో తమ సత్తా చూపెట్టాలని భారతీయ జనతా పార్టీ(BJP)ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ పై పోటీగా ఈటల రాజేందర్ భార్య జమునని దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గజ్వేల్ నుంచి ఈటల జమున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ జమున పేరుతో కార్యకర్తలు గజ్వేల్ బీజేపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. ఎమ్మెల్యె టిక్కెట్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిన్నటితో ముగియగా వారం రోజుల్లో మొత్తం 119 స్థానాలకుగాను 6,003 దరఖాస్తులు వచ్చాయి.

ANN TOP 10