AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుకు జైలా.. హౌస్ రిమాండా? ఇవాళ తేల్చనున్న ఏసీబీ కోర్టు

నాలుగు రోజులుగా ఏపీ వార్తలే హైలెట్ అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్. ఐతే.. ఈ హైప్‌ని కొనసాగిస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టులో వేస్తున్న పిటిషన్లు.. ఈ ఎపిసోడ్‌ని ట్విస్టులతో ముందుకు సాగేలా చేస్తున్నాయి. నిన్నంతా ఒకటే పిటిషన్లు. చివరకు వరుస పిటిషన్లతో ఓ దశలో జడ్జి కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

చంద్రబాబుకి రాజమండ్రి సెంట్రల్ జైలులో తగిన సెక్యూరిటీ లేదనీ, ఆయనకు ప్రాణహాని ఉందనీ.. ఆయనకు జైల్లో కాకుండా.. హౌస్ రిమాండ్ విధించాలని కోరుతూ.. ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా పిటిషన్ వేశారు. దీనిపై నిన్న లోతుగానే వాదనలు జరిగాయి. ప్రధానంగా గౌతమ్‌ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు మే 12, 2021న ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూత్రా ఉదాహరణగా ప్రస్తావించారు.

సిద్ధార్థ్ లూత్రా వాదన:
సెక్షన్‌ 167 కింద ఇలాంటి కేసుల్లో హౌస్‌ రిమాండ్‌కు ఆదేశించే అధికారం కోర్టులకు ఉంటుందని గౌతమ్‌ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని లూత్రా తెలిపారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, నిందితుడి పూర్వ చరిత్ర, నేర స్వభావం ఆధారంగా న్యాయస్థానాలు నిర్ణయం తీసుకోవచ్చని గౌతమ్‌ నవ్‌లాఖా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన:
నవ్‌లఖా కేసు తీర్పు.. చంద్రబాబు విషయంలో వర్తించదనీ, చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి, ఆయనకు హౌస్ రిమాండ్ అవసరం లేదు, పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత చాలా బాగుంది, హౌస్ కంటే జైలులోనే భద్రత ఎక్కువగా ఉంటుంది అని సీఐడీ తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10