ఆసియా కప్‌లో మరోసారి దాయాదుల పోరు ప్రారంభమైంది. కొలంబో వేదికగా సూపర్ -4 దశలో టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడుతోంది. ఇప్పటికే బంగ్లాను చిత్తు చేసిన పాక్ మరింత ఉత్సాహంతో ఉంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దింతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. ప్రస్తుతం జట్టు స్కోరు 7ఓవర్లకు 38/0గా ఉంది. ఓపెనర్లు గిల్ 26, రోహిత్ శర్మ 10 పరుగులతో ఆడుతున్నారు.









