ప్రెజర్ కుక్కర్ల పంపిణీని అడ్డుకోవడం కుట్రే
నీచరాజకీయాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్: మహిళల కోసం ప్రెజర్ కుక్కర్లను పంపిణీ చేస్తుంటే ఎమ్మెల్యే అడ్డుకోవడం ముమ్మాటికీ కుట్రేనని, జోగురామన్న మహిళా ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ మహిళల కోసం ప్రెజర్ కుక్కర్లను పంపిణీ చేస్తున్నామని, కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమం చేపట్టామని , ఇలాంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం జోగురామన్న కుట్రలకు పరాకాష్ట అని అన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ.. నీచమైన సలహాలతో కుట్రలకు తెరలేపారన్నారు. ప్రతిరోజు వందల మందికి కడుపు నింపుతుంది కేఎస్సార్ ఫౌండేషన్ అని అన్నారు. జోగురామన్న చర్యలతో ఆదిలాబాద్ ప్రజలు విసిగిపోయారన్నారు. ఏనాడైనా ఒక్కరికైనా జోగురామన్న బుక్కెడు అన్నం పెట్టారా..? అని కంది ప్రశ్నించారు. టాటాసన్స్- జేఎంఆర్ సంస్థల స్ఫూర్తితో కుక్కర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని చెప్పారు. పేదలకు పోషకారాహం అందాలన్నదే నా ప్రధాన ఉద్దేశమన్నారు. కుక్కర్‌లో వంట చేస్తే 90శాతం పోషకాలు అందుతాయని, ఈ విషయం డబ్ల్యూహెచ్‌ఓ నిర్ధారించిందన్నారు. అన్ని నిబంధనలు పాటించి సొంత ఖర్చులతో కుక్కర్లు పంపిణీ చేస్తున్నా మని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే.. జోగురామన్న చర్యలను మహిళాలోకం తీవ్రస్థాయిలో ఖండిస్తోంది.









