AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో రికార్డు వర్షపాతం.. 48 ఏళ్ల తర్వాత ఇదే అత్యధికం

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్‌గా చెప్పుకుంటారు. అయితే మెుదటి రెండు నెలలు వర్షాలు భారీగా కురిసినా.. సెప్టెంబర్‌లో మాత్రం సాధారణ వర్షాలు కురుస్తుంటాయి. ఈ సారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావటంతో జూన్ నెలలో వర్షాలు సరిగ్గా కురవలేదు. ఇక జులై చివరి వారంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఆగస్టు నెల మెుత్తం చెదురు మెుదురు వర్షాలు మినహా.. భారీ వర్షాలు కురవలేదు. కానీ సెప్టెంబర్ నెలలోకి ప్రవేశించగానే.. గత రెండ్రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో మంగళవారం (సెప్టెంబర్ 5న) కుండపోత వర్షం కురిసింది. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో రికార్డుస్థాయిలో దంచికొట్టింది. భారీ వర్షంతో నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం కేవలం నాలుగు గంటల వ్యవధిలో మియాపూర్‌లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1908, 1975 తర్వాత తాజాగా కురిసిన వర్షం సెప్టెంబర్‌లో మూడో అతిపెద్ద వర్షపాతం. 1908లో సెప్టెంబర్ 27న 15.3 సెం.మీ వర్షపాతం కురిసంది. ఇక 1975 సెప్టెంబర్ 19న 14.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. తాజాగా.. సెప్టెంబర్ 5న మియాపూర్‌లో 14.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ANN TOP 10