తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇవాళ 11 జిల్లాలకు, రేపు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రాలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇప్పటికే ఆరంజ్ అలెర్ట్ కొనసాగుతుంది. రానున్న 48 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడ ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు అతిభారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయి.
జీహెచ్ఎంసీ అప్రమత్తం..
తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. వర్షాల్లో నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్య ఉన్న వాళ్లు 040- 21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించింది.









