ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీకి పరోక్షంగా సేవలందిస్తానని మాజీమంత్రి గీతారెడ్డి స్పష్టం చేశారు. జహీరాబాద్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాజీమంత్రి గీతారెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సంఘటితమై పార్టీని జహీరాబాద్ ప్రాతంలో బలోపేతం చేయాలన్నారు.
తనకు ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని కార్యకర్తలతో చెప్పారు. గత 14 సంవత్సరాల కాలంగా జహీరాబాద్ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ నాయకులు తనకు ఆదరించి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మాజీమంత్రి గీతారెడ్డిని కలిసేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ ముల్తానీ, ఎంపీపీ అఽఽధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు నర్సింహారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరే్‌సగౌడ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









