లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా రాజ్‌భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గవర్నర్ తమిళిసై బోనం సమర్పించి వడి బియ్యం పోశారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని.. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందాలని అమ్మవారిని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు.










