కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పిలుపు
కంది శ్రీనన్న సమక్షంలో భారీగా చేరికలు
ఆదిలాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. పట్టణంలోని బంగారి గూడ లో చాంద్ పాషా, షేక్ ఫిరోజ్, అఫ్రోజ్ ఖాన్,అబీబ్ ఖాన్ ల ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమానికి కంది శ్రీనివాస రెడ్డి ముఖ్యతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు కంది శ్రీనివాస రెడ్డిని గుర్రం పై కూర్చోబెట్టి ఘన స్వాగతం పలికారు. వర్షం పడుతున్నా ఒక్కరు కూడా చేరికల కార్యక్రమం నుంచి కదలక పోవడం కంది శ్రీనివాస రెడ్డి పై ఉన్నఅభిమానానికి తార్కాణం. బంగారి గూడ కాలనీలో పేదలు నివసిస్తున్నారని వారికి కరెంటు మీటర్లు ఇవ్వకుండా ఎమ్మెల్యే జోగురామన్న ఆయన కొడుకు మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంది శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు.

ఒక్కో మీటర్ కు 12వేలు చెల్లించాలంటే పేదలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అలాగే ఇంటినెంబర్లు కూడా కేటాయించక పేదల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. వారికి వెంటనే మీటర్లు, ఇంటి నంబర్లు కేటాయించాలని లేదంటే వారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందని హెచ్చరించారు. ఇన్నేళ్లలో ఎమ్మెల్యే జోగురామన్న మీకు ఒక్క ఇల్లన్నా కట్టించిండా అని ప్రశ్నించారు. కాని అతని కొడుకు రూ.30కోట్లతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నడని ఆరోపించారు. పట్టణంలోని చాందా వద్ద రూ.100 కోట్లతో ఓక్లే స్కూల్ కడుతున్నారని ఈ సొమ్మంతా వారికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఇదంతా ప్రజల నుంచి దోచుకున్నదే అన్నారు. ఇలాంటి స్వార్థ పరుడైన ఎమ్మెల్యేను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. మీరందరూ తలుచుకుంటే జోగురామన్న అహంకారాన్ని బొంద పెట్టవచ్చన్నారు. కాంగ్రెస్ అధికారంలో కొస్తే తాను మీ అందరికి ఉచితంగా మీటర్లు, ఇంటినెంబర్లు కేటాయిస్తానన్నారు.

ప్రజలకిచ్చిన హామీలు విస్మరించిన జోగురామన్న ఒక జూటా రామన్న అని ఘాటుగా విమర్శించారు. ఆయన తనయుడు ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్ పదవికి అనర్హుడని అన్నారు. ఆయనను చైర్మన్ ను చేసేందుకు పాయల్ శంకర్ పరోక్ష సహకారమందించాడని ఆరోపించారు. పాయల్ శంకర్ డబ్బులకు అమ్ముడు పోయే రకమని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆదిలాబాద్ కోడై కూస్తోందని అన్నారు. జోగురామన్న పాయల్ శంకర్ తోడుదొంగలని ఇలాంటి వారికి ఓటువేస్తే అది మురికి కాలువలో పోతుందని వ్యాఖ్యానించారు. అందుకే ఆదిలాబాద్ అభివృద్ధి కోరుకునేవారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. జోగురామన్నకు నాలుగు సార్లు అవకాశమిచ్చారని తనకు ఒకేఒక్క అవకాశమివ్వాలని కంది శ్రీనివాస రెడ్డి ప్రజలను కోరారు. ఈకార్యక్రమంలో గిమ్మ సంతోష్, డిస్ట్రిక్ట్ మైనారిటీ సెల్ చైర్మన్ షకీల్, డిస్ట్రిక్ట్ ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కొండూరి రవి, మొహమ్మద్ ముఖీమ్, రహీమ్ ఖాన్, మొహమ్మద్ ఆఫ్సార్, షేక్ రహీమ్ రాథోడ్ బాబు లాల్, మాజీ కౌన్సిలర్ ఓసావార్ సురేష్, మాజీ కౌన్సిలర్ గేడం అశోక్,24 వార్డు అధ్యక్షుడు మానే శంకర్, షేక్ మన్సూర్ , వసీమ్ రంజాని, అస్బాత్ ఖాన్, ఎల్మా రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










