AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జోగురామన్నకు ఆస్తులు, అవినీతిపైనే ధ్యాస..

ఏనాడూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే
నాలుగు సార్లు గెలిచినా ఒరగబెట్టిందేమీలేదు
కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులుకంది శ్రీనివాసరెడ్డి ఫైర్‌
మేడిగూడలో పల్లె పల్లెకు కంది శ్రీనన్న కార్యక్రమం

ఆదిలాబాద్‌: నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన జోగు రామన్న సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీలేదని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులుకంది శ్రీనివాస రెడ్డి ఫైర్‌ అయ్యారు. గడపగడపకు కాంగ్రెస్‌ పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో కంది శ్రీనివాస్‌ రెడ్డి జైనథ్‌ మండలంలోని మేడిగూడ లో పర్యటించారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడప తిరిగి కాంగ్రెస్‌ గ్యారంటీ హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కంది శ్రీనివాస రెడ్డిని నాయకులు గ్రామస్తులు పూలమాలలు ,శాలువాలతో సత్కరించారు.

జోగు రామన్న ఎంత మందికి ఇండ్లు కట్టించిండని కంది శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నడు కదా ఓ ఐదువందల ఇండ్లు కట్టించిండా అని సెటైర్లు వేసారు. జోగు రామన్న ఇచ్చిన హామీలను నెరవేర్చని మోసగాడని ఆరోపించారు. కనీసం రేషన్‌ కార్డు కూడా ఇప్పించలేని అసమర్థుడు అని విమర్శించారు. అర్హులైన వృద్ధులు వికలాంగులకు పెన్షన్‌ రావడం లేదని అందుకే వచ్చేఎన్నికలలో ఆయనను చిత్తుగాఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలన్నారు. ఆదిలాబాద్‌ కు పట్టిన శనిగ్రహాలు జోగురామన్న, పాయల్‌ శంకర్‌ అని కంది శ్రీనివాస రెడ్డి అరోపించారు. ఇద్దరూ తోడుదొంగలని విమర్శించారు. వారిద్దరిలో ఎవరికి ఓటేసినా అది మోరీలో పడినట్టేనని అన్నారు. అందుకే అభివృద్ధి కోరుకునేవారు కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని కోరారు. గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీ నే అని, మళ్లీ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. అందుకే చేతి గుర్తుకే ఓటేయాలని కోరారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ వస్తే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని భూయజమానికి కౌలు దారునికి ఇద్దరికి రైతుబంధు అందిస్తుందని తెలిపారు. భూమి లేని పేదలు ,రైతులు చనిపోతే కుటుంబానికి ఐదు లక్షల బీమా అందిస్తుందని అన్నారు. ఉపాధికూలీలకు నెలకు వెయ్యిరూపాయలు ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ ను ఒక్కసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గీమ్మ సంతోష్,జిల్లా మైనారిటీ సెల్‌ చైర్మన్‌ షకీల్‌ ,జిల్లా లీగల్‌ సెల్‌ చైర్మన్‌ ఎల్మ సంజయ్‌ రెడ్డి ,నాగర్కర్‌ శంకర్,అల్లూరి అశోక్‌ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రాజన్న, లక్ష్మిపూర్‌ ఎంపీటీసీ మనోజ్,మాజీ ఎంపీటీసీ చిట్యాల భూమన్న రవీందర్‌ రెడ్డి, భూమ రెడ్డి,భోజ రెడ్డి, వసంత్, మాజీ ఎంపీటీసీ రాజ్‌ మొహమ్మద్, రవి, గంభీర్‌ రావు, గోపతి రామన్న, చిట్యాల నర్సింగ్, అక్తర్,చిట్యాల సంతోష్, సుధాం రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, నాగన్న, లాస్మా రెడ్డి, మజర్‌ మై ఉద్దీన్, బాపూరావు, లక్ష్మణ్,కళ్లెం రాజా రెడ్డి, నిమ్మల భూమారెడ్డి, దీపక్‌ రావు, ప్రభాకర్‌ రావు, రామ్‌ రెడ్డి, ఎల్మా రామ్‌ రెడ్డి, గేడం అశోక్, మానే శంకర్, ఓసావర్‌ సురేష్, పోచ్చన్న, పోతారాజు సంతోష్, సంతోష్‌ రెడ్డి, కిష్టా రెడ్డి, సంజీవ్, బండి కిష్టాన్న, దర్శనాల చంటి, నందు, షేక్‌ షాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10