AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరవీరుల త్యాగం.. కల్వకుంట్ల వారి భోగం.. మరోసారి షర్మిల ఫైర్‌

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల (Ys Sharmila) దూకుడు పెంచారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3800 కిలోమీటర్లకు పైగా ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఇక ఆ తరువాత నుంచి కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటీవల TSPSC పేపర్ లీక్ పై కూడా షర్మిల (Ys Sharmila) తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని కేసీఆర్ కు వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ కుటుంబంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట. దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాకుండెనట అంటూ షర్మిల (Ys Sharmila) మరోసారి కేసీఆర్ కుటుంబంపై సెటైర్లు వేశారు. ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట. ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే అంటూ నిలదీశారు. 1200 మంది అమరుల త్యాగాలపై రాజ భోగాలు అనుభవిస్తూ..రాష్ట్ర సంపదను పందికొక్కుల లెక్క దోచుకుతింటూ..ఉద్యమం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులను..సకల జనులను అవమానించడమే మీ సంస్కారమా? అని షర్మిల ప్రశ్నించారు.

ANN TOP 10