రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షను ఆ పాలని నాలుగు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకో ర్టు పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఈ నెల 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది.
దీంతో ఈ నెల 11న యథావిథిగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇదిలా ఉంటే టిఎస్‌పిఎస్‌సిలో ప్రశ్నపత్రాల లీకే జీ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు పలు పరీక్షను రద్దు చేశారు. అ యితే తాజాగా ఈ నెల 11న గ్రూప్ 1 పరీక్ష ను నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి సిద్ధ్దమైంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in / నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల ని కమిషన్ సూచించింది. అయితే పేపర్ లీక్ ఆ రోపణలు ఎదుర్కొంటున్న చేతనే మళ్లీ పరీక్షను నిర్వహించడంపై పలువురు అ భ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.









