AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్..

ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత నిరంతరాయంగా శ్రమించిన సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. నిన్న ఉదయం 10.45 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరింది.

ANN TOP 10