భారీ బహిరంగ సభలకు ప్లాన్
తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. తెలంగాణ బీజేపీ ఈ నెలలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. ఈ సభలకు అమిత్ షా, నడ్డా హాజరుకానున్నారు. ఈ నెల 15న ఖమ్మానికి అమిత్ షా రానున్నారు. సాయంత్రం బహిరంగ నిర్వహించున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భాగంగా ప్రజల్లోకి బీజేపీ వెళ్లనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు. ప్రధాని మోదీతోనూ బీజేపీ బహిరంగ సభ ప్లాన్ చేస్తోంది.









