రైళ్ల ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ 2022 లో కవచ్ అనే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనేది ఒక ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. అలాగే ఈ కవచ్ వ్యవస్థ ద్వారా రైళ్లు వెనక్కి నడుస్తాయి. అందువల్ల ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా అవి ఎట్టి పరిస్థితుల్లో ఢీకొనలేవు. ఈ కవచ్ వ్యవస్థను దశలవారీగా దేశవ్యాప్తంగా రైల్వే శాఖ అమల్లోకి తెస్తోంది.
మరి ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 3 రైళ్లు ఢీకొట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ రూట్‌లో కవచ్ వ్యవస్థ అందుబాటులో ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1,455 రూట్ కిలోమీటర్లు కవర్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చి 2024 నాటికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాల్లో ఈ కవచ్ వ్యవస్థను అమల్లోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో ఈ కవచ్ వ్యవస్థ కోసం కేటాయింపులు కూడా చేస్తోంది.









