రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(జూన్ 3) రాష్ట్రంలో సంతాప దినంగా పాటించనుంది. ఈ మేరకు ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా కాసేపట్లో సీఎం పట్నాయక్ కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరీశీలించనున్నారు.
దశాబ్ధ కాలంలో అతిపెద్ద రైలు ప్రమాదం
2012
మే 22న హంపి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో, కార్గో రైలు హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో ఢీకొన్నాయి. రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పడం వాటిలో ఒకటి మంటలు చెలరేగడం వల్ల దాదాపు 25 మంది మరణించారు 43 మంది గాయపడ్డారు.
2014
మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో, గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్, ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.
2016
నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో దాదాపు 150 మంది ప్రయాణికులు మరణించగా..మరో150 మందికి పైగా గాయపడ్డారు.
2017
ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది రైలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 70 మంది గాయపడ్డారు.
ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మరణించగా దాదాపు 60 మంది గాయపడ్డారు.
2022
జనవరి 13న, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ కనీసం 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించగా 36 మంది గాయపడ్డారు.
2023
లేటెస్ట్ గా జూన్ 2న బెంగళూరు -హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో ఒడిశాలో జరిగిన ఘోర ట్రిపుల్ రైలు ప్రమాదంలో233 మరణించాగా 900 మందికి పైగా గాయపడ్డారు.









