ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 238కి చేరగా… మరో 1000 మందికి పైగా గాయాలయ్యాయి. రైల్వే అధికారులు, ఆర్మీ సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి ప్రకటించారు. ఇవాళ రాష్ట్ర వేడుకలను రద్దు చేసిన ఒడిశా సర్కార్ ..ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. రైలు ప్రమాద ఘటనపై పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ సమీక్ష
ప్రమాద ఘటనపై తమిళ నాడు సీఎం సమీక్ష నిర్వహించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో మాట్లాడారు. తమిళనాడు తరపును సహాయక చర్యలకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశాలకు ఉదయనిధి స్టాలిన్ మంత్రుల బృందం వెళ్లిందని చెప్పారు.
ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన దురదృష్టకరమని ఏపీ సీఎం జగన్అన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలానికి అధికారుల బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సీఎం నవీన్ పట్నాయక్
ఒడిశా రైలు ప్రమాదం జరిగిన స్థలం దగ్గరకు సీఎం నవీన్ పట్నాయక్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.
జూ.ఎన్టీఆర్ దిగ్భ్రాంతి
రైలు ప్రమాద ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.









