ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రమాద విషయం తెలిసి గుండె ముక్కలైందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
ఇక ఈ ప్రమాద ఘటనపై తమిళనాడు సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ ఘటనపై ఒడిశా సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం తమిళనాడు రవాణశాఖ మంత్రి ఒడిశాకు వెళ్తున్నారు. రవాణాశాఖ మంత్రితో పాటు ఒడిశాకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు వెళ్తున్నారు. కేంద్రం, ఒడిశా ప్రభుత్వం మృతులకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ప్రకటించారు. సహాయక చర్యల కోసం పలు రైల్వే స్టేషన్ లలో హెల్ప్లైన్ నెంబర్ లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో నవీన్ పట్నాయక్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించనున్నారు.
హౌరా హెల్ప్లైన్ నెంబర్: 033-26382217
ఖరగ్పూర్ హెల్ప్లైన్ నెంబర్లు: 89720 73925- 93323 92339
బాలాసోర్ హెల్ప్లైన్ నెంబర్లు: 8249591559-7978418322
షాలిమార్ హెల్ప్లైన్ నెంబర్: 9903370746
విశాఖ హెల్ప్లైన్ నెంబర్లు: 08912-746330-08912-744619
విజయనగరం హెల్ప్లైన్ నెంబర్లు: 08922-221202-08922-221206
విజయవాడ హెల్ప్లైన్ నెంబర్: 0866-2576924
రాజమహేంద్రవరం హెల్ప్లైన్ నెంబర్: 0883-2420541










