AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా చేరుకున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి


ఘనస్వాగతం పలికిన ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, సోదరుడు ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీల డైరెక్టర్‌ కంది రాకేష్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. చిన్న వయసులోనే సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు నిర్వహిస్తున్న రాకేష్‌ రెడ్డిని రేవంత్‌రెడ్డి అభినందించారు. రేవంత్‌రెడ్డి కి ఘనస్వాగతం పలికిన వారిలో తెలుగు ఎన్నారైలు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌ కార్యక్రమానికి సంబంధించిన సన్నద్దతను రేవంత్‌ కు కంది శ్రీనివాసరెడ్డి వివరించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి రేవంత్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్‌ఆర్‌ఐలు మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో రాహుల్‌ ర్యాలీ పై భారతీయుల్లో క్రేజ్‌ పెరిగింది.

ANN TOP 10