AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్రాహ్మణ సంక్షేమానికి వరాల జల్లు

పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం.. సీఎం కేసీఆర్‌
పేదరికంలో ఎవరి జీవితాలు ఉన్నా వారిని మానవీయ కోణంలో ఆదుకోవడం ప్రభుత్వం లక్ష్యమని, పేరుకు పెద్ద కులమైన బ్రాహ్మణుల్లో జీవనం గడవని పేద బ్రాహ్మణులూ ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. విప్రహిత పేరుతో వెలసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్‌పల్లిలో 9 ఎకరాల్లో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.. రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలను అందించనుందన్నారు. ఈ భవనంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం పేద బ్రాహ్మణులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్‌ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయన్నారు. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత భాగవత రామాయాణాది కావ్య ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలన్నారు. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా మహౌపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరిట ఆ మహానీయుని స్వస్థలమైన మెదక్‌ జిల్లా కొల్చారంలో సాంస్కృత విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది ప్రకటించారు.

బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట..
బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 100 కోట్లు కేటాయించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. వివేకనంద స్కాలర్‌షిప్‌తో విదేశీ చదువులకు ఇప్పటి వరకు 780 విద్యార్థులు లబ్ది పొందినట్టు తెలిపారు. బ్రాహ్మణ ఎంఫర్‌మెంట్‌ స్కిమ్‌ కింద పెట్టుబడి కోసం గరిష్టంగా రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఈ స్కీమ్‌కు రూ.150 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ధూపదీప నైవేద్యం కింద దేవాలయ నిర్వహణ ఖర్చులు రూ. 6000 నుంచి రూ.10,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. వేదశాస్త్ర పండితుల భృతి రూ.2500 నుంచి రూ.5000కు పెంచడంతో పాటు అర్హత వయస్సు 75 నుంచి 65కు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, పీఠాధిపతులు, బ్రహ్మణ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10