AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన ఎమ్మెల్యే

గుజరాత్‌లోని రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ (BJP) నేత హీరా సోలంకి ముగ్గురు యువకుల ప్రాణాలను కాపాడారు. ఓ పడవలో వచ్చిన కొందరు వ్యక్తులు కూడా దీనికి సహకరించడంతో ముగ్గురు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బుధవారం పట్వా గ్రామం సమీపంలో జరిగింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, కల్పేష్ షియాల్, విజయ్ గుజారియా, నికుల్ గుజారియా, జీవన్ గుజారియా అనే నలుగురు యువకులు పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు బుధవారం వెళ్లారు. స్నానం చేయడం కోసం వీరు సముద్రంలో దిగారు. అదే సమయంలో ప్రవాహం తీవ్ర స్థాయిలో రావడం, పెద్ద గాలి వీయడంతో వీరంతా సముద్రంలోకి జారిపోయారు. తమను కాపాడాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. సముద్రం ఒడ్డున ఉన్న చాలా మంది దీనిని గమనించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి వెంటనే సముద్రంలోకి దూకి, కొట్టుకుపోతున్న నలుగురిలో ముగ్గుర్ని కాపాడగలిగారు. వీరిని ఓ పడవలోకి ఎక్కించి, ఒడ్డుకు చేర్చారు. అయితే జీవన్ గుజారియా మాత్రం వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఆయన మృతదేహం బుధవారం సాయంత్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

ANN TOP 10