AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుపతిలో రోడ్డు ప్రమాదం… మహబూబాబాద్ వాసులు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్‌టిసి బస్సును కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10