AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నల్ల కుబేరులకు రెడ్ కార్పెట్ కోసమే…

రూ 2 వేల నోట్ల రద్దుపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు
రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఇదో మూర్ఖపు చర్య అని, ఇది కేవలం నల్లధనాన్ని సులభంగా దాచుకోవడానికి సాయపడుతుందని ఆయన ధ్వజమెత్తారు. నల్ల కుబేరులకు కరెన్సీని మార్చుకోవడానికి రెడ్ కార్పెట్‌ వేశారని మాజీ ఆర్ధిక మంత్రి ఆరోపించారు. 2016 నాటి డీమోనిటైజేషన్ తర్వాత ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చిదంబరం ఎగతాళి చేశారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు.

ANN TOP 10