AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ

తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్ ఆదివారం నాడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఈ మేరకు 5,364 మీటర్ల ఎత్తున ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకుని మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేసి తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా చాటాడు. మారుమూల తండాలోని రాతి గుట్ట నుంచి మొదలైన ప్రస్ధానం ఇప్పుడు ఎవరెస్టును చేరుకుంది. ఇప్పటికే ప్రపంచంలోని ఖర్డుంగ్‌లా, కిలిమంజారో, యునామ్, ఎల్బ్రస్ పర్వతాలను చుట్టేసి ఎంతో ప్రసిద్ధిగాంచిన పర్వత శ్రేణులపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారత దేశ ఔన్నత్వాన్ని యావత్ ప్రపంచానికి చాటాడు. ప్రస్తుతం ప్రపంచం కెల్లా ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాడు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయితీకి చెందిన భూక్య రాంమూర్తినాయక్, జ్యోతి గిరిజన దంపతుల కుమారుడు భూక్య యశ్వంత్. తండ్రి భూక్య రాంమూర్తినాయక్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ (ఆర్టిజన్)గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి జ్యోతి కూలీ పనులు చేస్తూ కుమారుడైన యశ్వంత్‌కు ఇష్టమైన పర్వతారోహణను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ ఇబ్రహింపట్నంలోని ఎన్‌డిసి కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. చిన్ననాటీ నుంచి యశ్వంత్ పర్వతారోహణ అంటే ఆసక్తి చూపించేవాడు. ఈ ఆసక్తితోనే అనేక రాక్ క్లైంబింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్వతాలు విజయవంతంగా అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాడు.

ANN TOP 10