AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Ys Vivekananda Reddy Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 (సోమవారం)న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. తల్లి ఆస్పత్రిలో ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు.

వాస్తవానికి శుక్రవారం (మే 19న) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంతో.. అవినాష్ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చింది. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని.. అందుకే విచారణకు రాలేనని లాయర్ల ద్వారా సమాచారం పంపించారు. అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరిన సమయంలోనే తల్లి అనారోగ్యం గురించి తెలిసిందని.. అందుకే విచారణకు రాలేదని లాయర్లు సీబీఐకి తెలిపారు. విచారణ కోసం మరో తేదీ ఇవ్వాలని సీబీఐని కోరారు.

ANN TOP 10