AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రయాణికుడికి గుండెపోటు.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్‌

ప్రయాణికుడికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నైలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. సౌదీ అరేబియా జొడ్డా నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 278 మంది ప్రయాణికులతో ఎయిర్‌ ఏసియా విమానం(Air Asia flight) గురువారం బయల్దేరింది. చెన్నై గగనతంలో విమానం వస్తుండగా ఇండోనేసియా ప్రయాణికుడు బుహారిజింటో (64)కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో విమానం చెన్నై సరిహద్దుల్లో ఉందని గుర్తించిన పైలెట్‌ ఎమర్జెనీ ల్యాండిగ్‌కు అనుమతివ్వాలని చెన్నై విమానాశ్రయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత విమానాశ్రయ అధికారుల అనుమతితో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆ విమానం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు విమానంలోకి వెళ్లి ఆ ప్రయాణికుడిని పరిశీలించి ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆ ప్రయాణికుడు అప్పటికప్పుడు అత్యవసర వైద్య వీసాను మంజూరు చేయించిన విమానాశ్రయ అధికారులు అంబులెన్స్‌లో ఆయనను క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు ఇండోనేసియా రాయబార కార్యాలయానికి తెలిపారు. ఆ తర్వాత 277 మంది ప్రయాణికులతో రాత్రి 11.50 గంటలకు విమానం బయల్దేరి వెళ్లింది.

ANN TOP 10