హైదరాబాద్ : నిన్న సాయంత్రం సడెన్‌గా ఆర్బీఐ రూ.2 వేల నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. రూ. 2000 నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. తాను రూ.2000 నోటు చూడక రెండు మూడు నెలలు అవుతోందన్నారు. తాను ఎప్పుడు ఏటీఏంకి వెళ్లి డబ్బులు డ్రా చేసినా 500 నోట్లే వస్తున్నాయన్నారు. రూ.2 వేల నోటు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందన్నారు. సీఎం కేసీఆర్ కి మెమోరీ లాస్ స్టార్ట్ అయిందన్నారు. కేసీఆర్ ఏమేం మాట్లాడారో గుర్తు రావాలంటే పాత వీడియో రికార్డులు చూడాలన్నారు. దళితులు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కొని అమ్మకానికి పెడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు









