కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగనున్నది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పలువురు విపక్ష నేతలను ఆహ్వానించింది. అయితే మిత్రపక్షాలు, తమకు అనుకూలంగా ఉండే పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపింది. తెలంగాణ, కేరళ, ఒడిశా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలకు మాత్రం ఆహ్వానాలు పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది.









