హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని కైతలాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరువుతున్నారు. అయితే సభకు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) వస్తారని ప్రచారం జరిగింది.
కానీ ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబానికి సమయం కేటాయించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ కారణంగా జయంతి ఉత్సవాలకు హాజరుకావడం లేదని జూనియర్ తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి కమిటీకి కూడా ఇదే విషయం చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.









