AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభుత్వశాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు..

వీఆర్‌ఏల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెరవేర్చారు. వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్‌ సేల్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలోపు ఈ పని చేయాలని సూచించారు. దీనిపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వీఆర్‌ఏ జేఏసీ ప్రతినిధులను తన చాంబర్‌కు ఆహ్వానించి వారితో చర్చించారు. తమ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసమని, చిరుద్యోగులైన వీఆర్‌ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిషరించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సుమారు 20 వేల మంది ఉన్న వీఆర్‌ఏలలో ముందుగా మెడికల్‌ ఇన్‌ వ్యాలిడేషన్‌ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్నవారి వారసుల వివరాలు, విద్యార్హతలు సేకరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

మిగతావారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్‌, ఇరిగేషన్‌ (లషర్స్‌), రెవెన్యూ, జడ్పీ, ఎడ్యుకేషన్‌, మెడికల్‌ కాలేజీలు, మిషన్‌ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో సేల్‌ ఇస్తూ, తదుపరి ప్రమోషన్‌ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని రెవెన్యూశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను ఆదేశించారు. వీఆర్‌ఏలలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో వీఆర్‌ఏలు సమాచారం ఇవ్వడం సహా అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని వీఆర్‌ఏ జేఏసీ ప్రతినిధులను కోరారు.

ANN TOP 10