AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ముగ్గురు విద్యార్థులు మృతి
నగరంలోని నార్సింగి సీబీఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న కారును టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి టిప్పర్ బలంగా ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10