AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దాచేపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపలి మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు కూలీలు మరణించడంపై సిఎం విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి కెసిఆర్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. లక్ష పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో సిఎం మాట్లాడారు.

ANN TOP 10