AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపలి మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దినసరి కూలీలు గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మంజుల(25), పద్మ(27), సక్రి(35), సోనీ(28), కవిత (30)గా గుర్తించారు.

ANN TOP 10