AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెక్యులర్ పార్టీలకే మా మద్దతు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక కామెంట్స్
కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక కామెంట్స్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు మారాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సీపీఐకి కొత్త ఆప్షన్‌ దొరికిందని వెల్లడించారు. బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్ పార్టీతోనైనా.. తాము జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలో నంబర్ 2 కేంద్ర హోమంత్రి అమిత్‌ షాలు నాయకత్వం వహించినా.. ఆ పార్టీ ఓటమి పాలైందన్నారు.

కర్ణాటక ఫలితాలతో దక్షిణాదిలో బీజేపీకి గేట్లు మూతపడ్డాయని అన్నారు. ఏపీలో అందరూ ప్రధాని మోడీకి అనుకూలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారని.. కర్ణాటక తీర్పుతోనైనా వారిలో మార్పు రావాలన్నారు. మోడీ వ్యతిరేక శక్తులు బలోపేతం కావాలన్న నారాయణ.. టీడీపీ, జనసేన అధినేత పవన్‌ తమ పంథా మార్చుకొని బీజేపీ వ్యతిరేక లైన్‌ తీసుకోవాలన్నారు. తమదీ రాజకీయ పార్టీనేనని.. సన్నాసులం కాదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెక్యులర్ పార్టీలకే సపోర్ట్ చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఈనెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ వెల్లడించారు.

ANN TOP 10