AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రన్‌వేపైనే నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానం

హైదరాబాద్‌: సాంకేతిక సమస్య కారణంగా ఓ విమానం రన్‌వేపైనే రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ ఐ0541 విమానం సాయత్రం 4.24 గంటలకు బయలుదేరాలి. కానీ రన్‌వేపైనే నిలిచిపోయిన విమానం సాయంత్రం 6.15 వరకూ ప్రయాణం ప్రారంభించలేదు. ప్రయాణికులను విమానం నుంచి దిగనివ్వకపోవడంతో అంతా ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది ప్రయాణికులను తమ సీట్లోల్లో అలాగే కూర్చోపెట్టేశారు. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణం ఆలస్యమైనట్టు సమాచారం.

ANN TOP 10