AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జబర్దస్త్‌ ఫేమ్‌ రోహిణి.. ఆస్పత్రి బెడ్‌పై కదల్లేని స్థితిలో

జబర్దస్త్‌ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకుంది రోహిణి. టీమ్‌ మెంబర్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. తన కామెడీ టైమింగ్స్‌తో, మాట్లాడే విధానంతో అందరి ఫేవరేట్‌గా మారింది. మొట్టమొదటి లేడీ టీమ్‌ లీడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కూడా బిజీగా మారిన రోహిణి.. ఇప్పుడు ఆస్పత్రి పాలైంది. ఆమె కాలికి సర్జరీ జరగడంతో లేవలేని స్థితిలో హాస్పిటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటుంది. తనకు సర్జరీ జరిగిన విషయాన్ని రోహిణీయే స్వయంగా యూట్యూబ్‌ ద్వారా వెల్లడించింది.

దాదాపు ఐదేండ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్‌లో రోహిణి కాలిలో ఓ రాడ్‌ వేశారు. దాన్ని ఎప్పట్నుంచో తీసేయించాలని రోహిణి అనుకున్నప్పటికీ.. అప్పుడే కెరీర్‌లో బిజీగా మారడంతో కుదర్లేదు. ఇన్నేళ్లకు కాస్త లీజర్‌ టైమ్‌ దొరకడంతో ఆస్పత్రికి వెళ్లి రాడ్‌ తీసేయించుకోవాలని భావించింది. అందుకే రీసెంట్‌గా ఆస్పత్రికి వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రోహిణి కాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు షాకిచ్చారు. చాలా కాలం కావడంతో రాడ్‌ స్కిన్‌కు అతుక్కుపోయిందని.. ఒకవేళ ఫోర్స్‌ పెట్టి తీస్తే మల్టీపుల్‌ ఫ్రాక్చర్‌ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో కాలిలో నుంచి రాడ్‌ తీయడం సాధ్యపడలేదు. కానీ ఆమె కాలికి మైనర్ సర్జరీ మాత్రం చేశారు.

ANN TOP 10