ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుండి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన చైన్ స్నాచర్ ను KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కందుకూరుకు చెందిన మల్లా వెంకటేశ్వరరావు నిజాంపేట్ రోడ్డులోని ప్రశాంత్ నగర్ లో నివాసముంటున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గతంలో చిన్న చిన్న చోరీలకు పాల్పడిన వెంకటేశ్వర రావు.. తాను అద్దెకు ఉంటున్న యజమాని ఇంట్లోనే చోరికి పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో యజమానురాలు తప్ప ఎవరూ లేరని తెలుసుకొని.. ఇంటికి వెళ్లి ఓనర్ మహాలక్ష్మితో మరో ఇళ్లు అద్దెకు కావాలంటూ మాటల్లో పెట్టి ఆమె కళ్ళల్లో శనగ పిండి కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుని అక్కడ నుంచి పరారయ్యాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని అరెస్టు చేశారు.









