బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. ఈ సెలబ్రిటీల ఇద్దరి మధ్య లండన్‌లో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారి..ఇప్పుడు నిశ్చితార్ధం చేసుకునే వరకు వచ్చింది. ఢిల్లీలో పరిణితిచోప్రా, రాఘవ్‌చద్దా ఎంగేజ్‌మెంట్ శనివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది.
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు ఆశీర్వదిస్తూ అడ్వాన్స్ వెడ్డింగ్ విషెస్ చెబుతున్నారు.









