నంద్యాల: జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అవుకు రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి 13 మంది గల్లంతయ్యారు. కోవెలకుంట్లలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రసూల్.. కుటుంబంతో కలిసి బోటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రసూల్ కుమార్తె మృతి చెందింది. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. బోటులో ఒకవైపు ఎక్కువ మంది కూర్చడంతో ఒరిగి బోల్తా పడినట్లు సమాచారం.









