వరుణుడి ప్రతాపంతో ఇన్నాళ్లు ఇబ్బందిపడ్డ ప్రజలను.. ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమయ్యాడు భానుడు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎండలు దంచికొట్టనున్నాయి. ఇవాళ,రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.కాగా ఇప్పటికే హైదరాబాద్ లో ఎండతీవ్రత పెరిగింది.జగిత్యాల జిల్లాలో నిన్న 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏపీలోనూ కోస్తాంధ్ర జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉంది. నేడు 45, రేపు 104 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని.. కాబట్టి ఎండలో ఎవ్వరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. .









