AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీవారిమెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం..

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో రెండు పిల్లలతో ఎలుగుబంటి సంచరిస్తుండటం కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు దర్శన కౌంటర్ సమీపంలో ఇవి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులు భయంతో పరుగులు పెట్టారు. దర్శన కౌంటర్‌లో పనిచేస్తున్న టీటీడీ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చేలోగా ఎలుగుబంటి.. రెండు పిల్లలతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంట్లను కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డు చేశారు.

ANN TOP 10