AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫెయిలైన విద్యార్థులూ దయచేసి ఇలా చేయకండి..

మంత్రి సబితా కీలక సూచనలు
తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసిన విద్యార్థుల ఫలితాలొచ్చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ పలు కీలక సూచనలు, సలహాలు చేశారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
మార్కులు తక్కువగా వచ్చినా, ఫెయిల్ అయినా అధైర్య పడవద్దు
తప్పుడు నిర్ణయాలు తీసుకునేప్పుడు తల్లితండ్రుల కష్టం గుర్తు తెచ్చుకోండి
తల్లిదండ్రులు కూడా పిల్లలకు మనోధైర్యం ఇచ్చి అండగా నిలవాలి
విద్యా సంవత్సరం కోల్పోకుండా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాం
వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం
వెనుకబడతామనే ఆందోళన విద్యార్థుల్లో అక్కర్లేదు
మే-26 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు ఛాన్స్
జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి
గురుకులాల్లో వచ్చిన సక్సెస్ మిగతా పాఠశాలల్లో రావాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

ఆవేశం వద్దు.. ఆలోచించండి..!
పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని పిల్లలకు తల్లిదండ్రులు పెద్ద సపోర్ట్‌గా నిలవాలే కానీ మరో విద్యార్థితో పోల్చి చూసి కోప్పడితే వారిని నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఫెయిల్ అయితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. పరీక్షల్లో ఫెయిలైతే మళ్లీ సప్లిమెంటరీ అనేది ఒకటి ఉంటుంది కదా.. కానీ ప్రాణం పోతే సప్లిమెంటరీ ఉండదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా తమను కోల్పోతే వారు ఏమవుతారోనని ఒక్కసారైనా ఆలోచించాలి. అసలు నిజానికి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి.. అంతటి ధైర్యమేదో సమస్యను ఎదుర్కోవడంలోనో.. ఫెయిలైన అనంతరం జీవితాన్ని మలచుకోవడం పైనో పెడితే ఆ తరువాతి జీవితం అద్భుతంగా ఉంటుందన్న విషయం తెలుసుకుంటే మంచిది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10