ముగ్గురు బాలికలు మృతి
వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలం తాటిపాములలో విషాదం చోటుచేసుకుంది. వీరసముద్రం చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులు తిరుపతమ్మ(16), సంధ్య(12), దీపిక(10)గా గుర్తించారు.
చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్ళగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన బాలికలుగా గుర్తించారు. మృతులు కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.









