AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు హైదరాబాద్‌లో అద్భుతం.. నీడ మాయం..

ఈ టైంలో చెక్ చేయండి..!
జీరో షాడో డే
రేపు హైదరాబాద్ నగరంలో.. అరుదైన ఆసక్తికరమైన అద్భుత సన్నివేశం ఆవిష్కృతమవనుంది. మంగళవారం రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం కానుంది. నీడ మాయమవటమేంటీ.. అన్న డౌటనుమానమా. అదేనండి జీరో షాడో డే.. అంటే ఈ రోజున ఒకానొక సమయంలో నీడ మొత్తానికే కనిపించదన్న మాట.

ఇదేదో మాయో.. గమ్మత్తో కాదు.. సైన్స్. అయితే.. ఈ రోజున సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా నీడ కనిపించదని సైంటిస్టులు వివరిస్తున్నారు. అందుకే దీన్ని జీరో షాడో డే అని పిలుస్తారు. ఎండలో నిట్ట నిలువుగా ఉంచిన వస్తువుల షాడో.. సదరు రెండు నిమిషాల పాటు కనిపించదు. ఈ విషయాన్ని బిర్లా సైన్స్‌ సెంటర్‌ టెక్నికల్‌ అధికారులు వెల్లడించారు. అయితే.. ఇటువంటి అరుదైన, ఆసక్తికర, అద్భుత ఘటన రేపు హైదరాబాద్‌లో ఆవిష్కృతమవుతోందని తెలిపారు. దీన్ని నగరవాసులంతా కచ్చితంగా అనుభూతి చెందాలని తెలిపారు.

ANN TOP 10