తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.)పై మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాశరావు (Former MLA Gone Prakasa Rao) ఫైర్ (Fire) అయ్యారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ తెలంగాణ భవన్ (Delhi Telangana Bhavan)లో సరైన వసతులు లేవని, భవన్ రూములు పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్ రూముల కంటే, ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్‌లు శుభ్రంగా ఉన్నాయన్నారు. ఇద్దరు వ్యక్తులకు రోజుకు రూ. 6 వేలు చార్జ్ చేస్తున్నారని.. అయినా బాత్ రూమ్‌లో సౌకర్యాలు లేవన్నారు.
హైదరాబాద్‌లో బాత్ రూమ్‌కి వెళ్లాలంటే 20 రూపాయలు చార్జ్ చేస్తారని, ఢిల్లీలో ఉచితంగా టాయిలెట్ సౌకర్యం కల్పిస్తున్నారని గొనె ప్రకాశరావు అన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో లిఫ్ట్ పనిచేయదని.. పట్టించుకునేవారు లేరని, తాగునీటి సౌకర్యం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో నిర్భందం, నియంత పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. రేపు హైదరాబాద్ వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రిని కలసి తెలంగాణ భవన్‌లో సమస్యలపై వివరిస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణా భవన్‌లో బాత్ రూమ్ నీళ్లు తగాల్సిన పరిస్థితి ఏర్పడిందని గొనె ప్రకాశరావు అన్నారు. ఢిల్లీలో ఏ భవన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. జూన్ 30 లోపు చర్యలు తీసుకోకపోతే తానే తెలంగాణ భవన్ బాత్ రూమ్స్ క్లిన్ చేయిస్తానని, కూలర్లు పెట్టిస్తానని చెప్పారు.









