AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికాలో కాల్పులు.. తెలుగమ్మాయి మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. డల్లాస్‌ లోని అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు.ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా మరణించినట్లు పోలీసులు గుర్తించారు.ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. కూతురు మరణవార్త తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా,మిర్యాలగూడ.ఐశ్వర్య పర్‌ఫెక్ట్‌ జనరల్‌ కాంట్రాక్టర్స్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఐశ్యర్య మరణంపై టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.దుండగుడి కాల్పుల్లో తెలుగు బిడ్డ మృతి చెందడం బాధాకరమని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.ఐశ్వర్య భౌతిక కాయాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.

ANN TOP 10