AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భూమిని తాకిన సౌర తుఫాను.. లడఖ్‌లో అరుదైన దృశ్యం

తరుచూ అర్కిటిక్ ప్రాంతంలో కనిపించే అరుదైన అరోరా.. గత నెల లడఖ్‌లో కనువిందు చేసింది. భూ అయస్కాంత తుఫాను భూమిని తాకింది. హాన్లేలోని ఒక ఎత్తైన పరిశోధనా కేంద్రం ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (IAO)లో ఏర్పాటు చేసిన 360-డిగ్రీల కెమెరా.. ఆర్కిటిక్ ప్రాంతంలోని సాధారణంగా కనిపింే ఈ అద్భుతమైన దృశ్యాన్ని బంధించింది. ఏప్రిల్ 22-23 రాత్రి సమయంలో ఈ అరోరా కనిపించింది. సౌర తుఫాను కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME)కారణంగా ఈ వెలుగు ఏర్పడుతుంది. సూర్యుని ఉపరితలంపై ప్లాస్మా భారీ పేలుడు వల్ల సంభవించే కరోనల్ మాస్ ఎజెక్షన్.. గంటకు అనేక మిలియన్ల కిలోమీటర్ల వేగంతో భూమిని తాకి, దాని అయస్కాంత క్షేత్రానికి ఆటంకాలు కలిగిస్తుంది.

4,500 మీటర్ల ఎత్తులో సరస్వతి పర్వతంపై ఏర్పాటుచేసిన కెమెరాలు బంధించిన ఫోటోలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ విడుదల చేసింది. టైమ్‌లాప్స్ వీడియో లడఖ్‌లోని చాంగ్‌తంగ్‌లో రాత్రిపూట ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతోంది. ‘అరోరా రాత్రిపూట సాధారణం కంటే తక్కువ అక్షాంశాలకు చేరుకుంది.. ఇది యూరప్, చైనా, భారత్‌లోని లడఖ్ నుంచి అరుదైన వీక్షణకు దారితీసింది’ అని ఐఐఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వగీష్ మిశ్రా అన్నారు. ‘ఇంత తీవ్రమైన భూ అయస్కాంత తుఫాను చివరిసారిగా 2015లో సంభవించింది.’ అని తెలిపారు.

ANN TOP 10